జల్-జంగల్-జమీన్. ఆదిలాబాద్‌లోని గోండు గిరిజనులకే కాదు రాష్ట్రంలోని ఆదివాసీలందరి నినాదం. నిజాం విధానాలకు, జంగ్లాతు (అటవీ) అధికారుల దుర్మార్గాలకు నిరసనగా అనేక ఉద్యమాలు జరిగాయి. 1920 నాటి అటవీ చట్టం మొదలు 2005 నాటి అటవీ చట్టం దాకా గిరిజనులు మోసపోతూనే ఉన్నారు.
గోండుల ఆరాధ్య వీరుడు కొమురం భీం నిజాం విధానాలకు వ్యతిరేకంగా తన జాతిని ఏకంచేసి, ఆదివాసుల ప్రత్యేక ప్రతిపత్తికోసం పోరాడిన ధీరుడు. 12 గ్రామాల్లోని గోండుల్ని సమీకరించి పోరాటం సాగించి అసువులు బాసిన స్థలంలో (కెరమెరి మండలంలోని జోడేఘాట్) ప్రతీయేటా సంస్మరణ సభ జరుగుతుంది.
జాతరను తలపించే రీతిలో సాగే ఈ సంస్మరణ సభను అటు ప్రభుత్వమూ, ఇటు రాజకీయపార్టీలూ తమకు అనుకూలంగా వినియోగించుకుంటాయి. గిరిజనుల సమస్యల్ని పరిష్కరించే వేదికగా జోడేఘాట్‌లో ఐటిడిఎ దర్బారు నిర్వహిస్తోంది.
భీం వర్ధంతి వేడుకల వేదిక ఎక్కేందుకు రాజకీయ పార్టీలు పోటీలు పడతాయి. కానీ భీం కాలం నాటి పరిస్థితులే ఇంకా గిరిజన ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. కొమురం భీం పోరాటం నుంచి ఇవ్వాళ్టి కమ్యూనిస్టుల పోరాటం దాకా సమస్యంతా భూమి చుట్టే తిరుగుతోండటం భూ సమస్య తీవ్రతకు నిదర్శనం. భీం మరణం తరువాత అప్పటి నిజాం ప్రభుత్వం భూ సమస్య తీవ్రతను గుర్తించి గిరిజనుల స్థితిగతుల్ని అధ్యయనం చేసేందుకు హేమండార్ఫ్‌ను పంపించింది
0 comments