Content feed Comments Feed

Followers

Sponsors

హైదరాబాద్, ఆగస్టు24 : నిజాం నిరంకుశపాలనకు వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు తమదైన శైలిలో ఉద్యమించారు. స్వాతంత్య్ర ఉద్యమానికి చేయూతగా నిలిచిన ఉస్మానియా యూనివర్శిటీలోనే అనేక ఉద్యమాలు పుట్టాయి…. వందేమాతం ఉద్యమం మొదలుకొని…..వామపక్ష ఉద్యమాలు ఇక్కడే పుట్టాయి. ఈ క్రమంలోనే టిఆర్ఎస్ ఆవిర్భా వం తర్వాత ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఉద్యమం మళ్లీ మొద లైంది. ఉస్మానియా ఉద్యమాల చరిత్రలో వామపక్ష విద్యార్థి ఉద్య మం తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికే అధిక ప్రాధా న్యత ఉంది. ఈ నేపధ్యంలో నాటి నుంచి నేటి వరకు కొనసాగు తున్న తెలంగాణ విద్యార్థి ఉద్యమాన్ని గురించి తెలుసు కుందాం….
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మూలకారణం పెద్ద మనుషుల ఒప్పందం-ముల్కీ నిబంధనలను చెప్పుకోవచ్చు. తొలుత తెలంగాణ ప్రాంత విద్యార్థులకు విద్యా, ఉద్యోగ రంగాల్లో జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్‌లో 1968లోనే ఇక్కడి విద్యార్థి సంఘ సమావేశంలో తీర్మానం చేశారు. ముల్కీ నిబంధనలతో ఆరంభమైన తెలంగాణ రగడ ఆ తర్వాత అనేక రంగాల్లో ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలను వెలికితీస్తూ ప్రత్యేక రాష్ట్ర సాధన దిశగా విద్యార్థులే నాయకత్వాన్ని చేపట్టి ఉద్య మాన్ని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జిల్లాలకు వ్యాపింప చేసి పల్లెలదాకా తెలంగాణ నినాదాన్ని తీసుకుపోయారు.
1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కూడా ఓయులో పురుడుపోసుకుని తెలంగాణ జిల్లాలకు విస్తరించింది. ప్రత్యేక రాష్ట్రం కోసం విద్యార్థులు చేపట్టిన ఉద్యమాన్ని రాజకీయ నాయకులు తెలంగాణా ప్రజా సమితిపేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. 1968వ సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యా లయం విద్యార్థి సంఘ అధ్యక్షులు వెంకట్‌రాంరె డ్డి అధ్యక్షతన మల్లికార్జున్, శ్రీనివాస్‌రెడ్డి, వావిలాల భూపతి రెడ్డి తదితర సభ్యుల సమావేశంలో తెలంగాణా ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యో గాల నియామకం గురించి ప్రస్తావన చేశారు. 1969, జనవరి 12న ఓయు విద్యార్థిసంఘ సర్వసభ్య సమావేశం నిజాం కళాశాలలో వెంకటరామరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమా వేశానికి ఇప్పటి కేంద్రమంత్రి ఎస్.జయపాల్ రెడ్డి, పుల్లారెడ్డి,శ్రీధర్‌రెడ్డి, నారాయణదాస్ వంటి విద్యారి ్థనాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ముల్కీ నిబంధనలు పాటించ కుండా ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో తెలంగాణా ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని తీర్మానించారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమం ఊపందుకుంది. 1969 , మార్చి 8,9 తేదీల్లో ఉస్మానియా అధ్యాపకులు, విద్యార్థుల ఆధ్వర్యంలో రెడ్డిహాస్టల్‌లో తెలంగాణ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు టిఎన్ సదాలక్ష్మి, ప్రొఫెసర్ రావాడ సత్య నారాయణ , మదన్‌మోహన్, ఎస్‌బి గిరి, వందేమాతరం రామచందర్‌రావు, విద్యార్థి నాయకులు వెంకటేశ్వర్‌రావు, పుల్లారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, మల్లికార్జున్, వీరన్న ,గోపాల్, వెంకట్‌రెడ్డి, జలీల్‌పాషా హాజరయ్యారు. ఈసదస్సుకు తెలంగాణ జిల్లాల నుంచి 1500 మంది విద్యార్థి ప్రతినిధులు హాజరయ్యారు. కాగా ఈ సదస్సులో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు అన్ని వర్గాల వారిని చైతన్యపరిచి, సమీకరించి తెలంగాణ ప్రజా సమితిని బలంగా రూపొందించాలని అందుకు గాను తెలంగాణ సదస్సులను విస్త¬ృతంగా అన్ని జిల్లాల్లో జరపాలని నిర్ణయించారు. విద్యార్థులు తరగతులు బహిష్కరించి సమ్మెలు, ధర్నాలు చేయాలని తీర్మానించారు.
ఉస్మానియా విద్యార్థులు ఉద్యమిస్తున్న క్రమంలోనే జామై ఉస్మానియా రైల్వేస్టేషన్‌ను తగులబెట్టే ప్రయత్నంలో సర్వారెడ్డి, ప్రకాష్‌కుమార్ అనే ఇరువురు ఓయు విద్యార్థులు మరణించారు. ఈ ఘటన అనంతరం పోలీసులు ఉస్మానియా క్యాంపస్ హాస్టళ్లపై దాడి చేసి కొంతమంది విద్యార్థులను అదుపులోకి తీసుకుని హాస్టళ్లను మూసివేశారు. విద్యార్థుల మృతిపై నిజాం కళాశాలలో జరిగిన సంతాప సభలో పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీంతో కోపోద్రిక్తులైన విద్యార్థులు బయటకు వస్తూ బస్సులపై రాళ్లు రువ్వారు. ఇదే సమయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణాకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని మంత్రి వర్గంనుంచి రాజీనామా చేశారు. ఉస్మానియా యూనివర్శిటీ అధ్యాపకులు , సిబ్బంది తెలంగాణపై చర్చాగోష్టిని నిర్వహించారు. ఈ గోష్టికి అప్పటి ఓయు వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రావాడ సత్యనారాయణ హాజరుకాగా, ముగింపు సమావేశంలో మర్రి చెన్నారెడ్డి పాల్గొ న్నారు. మదన్‌మోహన్ నుంచి తెలంగాణ ప్రజాసమితి అధ్యక్ష బాధ్యతలను డాక్టర్ మర్రి చెన్నారెడ్డికి అప్పగించడాన్ని అప్పటి ఓయు విద్యార్థి సంఘ నాయకుడు శ్రీధర్‌రెడ్డి, మరికొంత మంది విద్యార్థి నాయకులు వ్యతిరేకించారు. ఇటీవలే మరణించిన ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ అనంత స్వామి అప్పటి తెలంగాణా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అక్టోబరులో మల్లికార్జున్ సికింద్రాబాద్ గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్షకు పూనుకున్నారు. నవంబరు మొదటి వారంలో మల్లికార్జున్‌ను పోలీసులు అరెస్టు చేసి ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించారు.
1969 మే, జూన్ నెలలో విద్యార్థి ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 300 మందికి పైగా విద్యార్థులు మరణించగా ఇందులో ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన విద్యార్థులు 20 మంది వరకు ఉన్నారని తెలుస్తోంది.
- ఆంధ్రజ్యోతి శుక్రవారం ఆగస్ట్ 25 ‘ 2006

0 comments

Post a Comment